‘21st’ పాటలు విడుదల
Published on Nov 1, 2015 8:00 am IST

21st
సన్ ఫ్లవర్ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ ఫిలిమ్స్, అవుల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై వెంకట్, వింధ్య, నవీన్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘21ST’. జయశంకర్ చిగురుల దర్శకత్వంలో యాదగిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిషేఖ్ వాలింబే సంగీతం అందించిన ఈ సినిమా పాటలను శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. దర్శకులు ఎన్.శంకర్, సయ్యద్ రఫీ కలిసి ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

ఎన్.శంకర్ మాట్లాడుతూ ‘’సినిమా ట్రైలర్, మ్యూజిక్ చాలా బావున్నాయి. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. మంచి టీమ్ తో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. సయ్యద్ రఫీ మాట్లాడుతూ ‘’ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది. ట్రైలర్, పాటలు బావున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ సాధించి నటీనటులు, టెక్నిషియన్స్ కు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు.

నిర్మాత యాదగిరి మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ తమదిగా భావించి కష్టపడి చేసిన సినిమా ఇది. సెన్సార్ కూడా పూర్తయింది. సినిమాను త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. దర్శకుడు జయశంకర్ చిగురుల మాట్లాడుతూ ‘’యూత్ ఫుల్ మూవీ. మంచి మ్యూజిక్ కుదిరింది. ప్రేక్షకులు మెచ్చే సినిమా అవుతుంది. నిర్మాతగారికి థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటింగ్: జయశంకర్ చిగురుల, కెమెరా: శ్రీవాస్, పాటలు: లక్ష్మీ రఘరాం, సంగీతం: అభిషేక్ వాలింబే, నిర్మాత: యాదగిరి, దర్శకత్వం: జయశంకర్ చిగురుల.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook