22 మిలియన్ వ్యూస్ తో “స్కంద” రిలీజ్ ట్రైలర్!

Published on Sep 27, 2023 5:04 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా, సాయి మంజ్రేకర్ మరొక లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ ట్రైలర్ ఇప్పటి వరకూ 22 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది. రామ్ పోతినేని చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు అనేది ఈ రెస్పాన్స్ ను చూస్తే తెలుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :