కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా “2+4=24” సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Published on Sep 24, 2021 10:00 am IST

కృష్ణ రావు సూపర్ మార్కెట్ సినిమా ద్వారా తన నటన తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 2+4=24. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆర్.పి రామ్ దర్శకత్వంలో సావిత్రి ఫిలిమ్స్ సమర్పణ లో రీల్స్ అండ్ రీల్స్ ప్రొడక్షన్ పతాకం పై నంబిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రిన్స్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాత నంబి రాజ్ మాట్లాడుతూ, “2+4=24 సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడి మీద పూర్తి నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నాం. కథ కు తగ్గ హీరో మాకు కృష్ణ గారి రూపం లో దొరికారు. ఆయన ఈ సినిమా తో మళ్ళీ ప్రేక్షకులను ఎంతగానో అలరించబోతున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.

దర్శకుడు ఆర్.పి రామ్ మాట్లాడుతూ, “సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. నన్ను నమ్మి ఈ సినిమా ను ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాత గారికి, సినిమా చేస్తున్న హీరో గారికి ధన్యవాదాలు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. త్వరలోనే మిగతా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. కృష్ణ గారి నటన ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఆయనకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుందని నమ్ముతున్నా” అని అన్నారు.

సంబంధిత సమాచారం :