‘నేను స్టూడెంట్ సర్’ నుండి ’24/7 ఒకటే ధ్యాస’ లిరికల్ సాంగ్ రిలీజ్

Published on May 16, 2023 7:38 pm IST

ఇటీవల స్వాతిముత్యం మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు యువ నటుడు బెల్లంకొండ గణేష్. ఆ మూవీతో మంచి విజయం అందుకున్న గణేష్ తాజాగా నటిస్తున్న మూవీ నేను స్టూడెంట్ సర్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాంది సతీష్ వర్మ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీలో అవంతిక హీరోయిన్ గా నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరచగా నేడు ఈ మూవీ నుండి 24/7 ఒకటే ధ్యాస అనే పల్లవితో సాగె యూత్ ఫుల్ మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. శ్రీహర్ష ఈమని రచించిన ఈ సాంగ్ ని బెన్నీ దయాల్, మహతి స్వర సాగర్ అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జూన్ 2 న థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :