సూర్య “24” సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.!

Published on Jul 16, 2022 7:01 am IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా చేసిన ఎన్నో వైవిధ్య సినిమాలు అలాగే పలు ఐకానిక్ రోల్స్ చేసిన చిత్రాల్లో ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువగా టచ్ చేసిన టైం ట్రావెల్ జానర్ లో చేసిన చిత్రం “24” కూడా ఒకటి. తానే హీరో మరియు విలన్ గా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు విక్రమ్ కే కుమార్ అద్భుతమైన వర్క్ అందించారు.

అయితే ఈ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి అంచనాలు రేకెత్తించగా మన తెలుగు మార్కెట్ లో కూడా మంచి వసూళ్లను సాధించింది. దీనితో అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ కోసం అంతా ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో దానిపై విక్రమ్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు.

ఈ సినిమాకి సీక్వెల్ అయితే ఉందని ప్రస్తుతానికి కొంత మేర స్క్రిప్ట్ ని లాక్ చెయ్యగా ఇంకా డెవలప్ చెయ్యాల్సి ఉందని తెలిపారు. అలాగే సూర్య చేసిన పవర్ ఫుల్ రోల్ ఆత్రేయ పై ఇంకా వర్క్ చెయ్యాల్సి ఉందని తాను తెలిపారు. మొత్తానికి అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మరో రెండు మూడేళ్లు ఈజీగా పడుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :