“వలిమై ఫస్ట్ సింగిల్” కి 25 మిలియన్ వ్యూస్!

Published on Sep 15, 2021 12:50 am IST


అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోథ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం లో హుమ ఖురేషీ, కార్తికేయ, బని, సుమిత్ర, అచ్యుత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను బోని కపూర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.

నాంగా వీర మారి పేరిట విడుదల అయిన లిరికల్ వీడియో సోషల్ మీడియా లో మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఈ పాట 25 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 1.3 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :