పుష్పరాజ్ భీభత్సం…ఫస్ట్ సింగిల్ ఐదు భాషల్లో 28 మిలియన్ వ్యూస్!

పుష్పరాజ్ భీభత్సం…ఫస్ట్ సింగిల్ ఐదు భాషల్లో 28 మిలియన్ వ్యూస్!

Published on Aug 17, 2021 12:50 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైస్ అంటూ మొదటి పార్ట్ నుండి దాక్కో దాక్కో మేక లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ పాట ఆగస్ట్ 13 న ఐదు భాషల్లో విడుదల అయింది. ఒక్క తెలుగు భాషలోనే ఇప్పటి వరకూ 15 మిలియన్ వ్యూస్ ను సాధించగా, 800కే లైక్స్ ను సొంతం చేసుకుంది.

అన్ని బాషల్లో కలిపి ఈ పాట 28 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించి, 1.4 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. యూ ట్యూబ్ లో ఈ పాట ట్రెండ్ అవుతోంది. పుష్ప చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు