తమిళనాడులో 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా !

ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 2.0 చిత్రం ఈనెల 29న భారీ స్థాయిలో విడుదలకానుందని తెలిసిందే. ఇక తమిళ నాడులో ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రెడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఈచిత్రం అక్కడ 120 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని సమాచారం. 100కోట్లకు పైగా బిజినెస్ చేసిన మొదటి తమిళ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈచిత్రం ఫై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంది. అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2డి తో పాటు 3డి లో కూడా విడుదలకానుంది.

Exit mobile version