నితిన్ మాస్ట్రో ట్రైలర్ కి భారీ రెస్పాన్స్…3 మిలియన్ వ్యూస్!

Published on Aug 24, 2021 11:42 am IST


మేర్లపాక గాంధీ దర్శకత్వం లో నితిన్ హీరోగా, నబ్బా నటేష్, తమన్నా భాటియా లు హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం మాస్ట్రో. ఈ 2018 లో బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన అంధధూన్ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. ఈ చిత్రం ట్రైలర్ ఆగస్ట్ 23 వ తేదీన సాయంత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రం ట్రైలర్ కి ప్రేక్షకులు, అభిమానుల నుండి ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ ట్రైలర్ ఇప్పటి వరకూ 3 మిలియన్ కి పైగా వ్యూస్ ను సాధించడం జరిగింది.కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నితిన్ పాత్ర సినిమా కి హైలెట్ అని తెలుస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కి సంగీతం మహతి స్వర సాగర్ అందించారు.

ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :