3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “అడిగా అడిగా” సాంగ్

Published on Oct 3, 2021 11:02 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రం వీరి హ్యాట్రిక్ చిత్రం గా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ వీడియో, పోస్టర్ తోనే సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్ ప్రకటన తో సినిమా రూపు రేఖలు మారిపోయాయి. ఈ చిత్రం నుండి ఇటీవల అడిగా అడిగా లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ అడిగా అడిగా అనే లిరికల్ సాంగ్ కి యూ ట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :