ఏదో ఏదో లిరికల్ వీడియో కి 3 మిలియన్ వ్యూస్!

ఏదో ఏదో లిరికల్ వీడియో కి 3 మిలియన్ వ్యూస్!

Published on Nov 27, 2021 12:42 AM IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో, రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, అభినవ్ గోమతం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు ఇప్పటికే ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి ఏదో ఏదో లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి యూ ట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, సోషల్ మీడియా లో సైతం ట్రెండ్ అవుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు