3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “లెహరాయి” సాంగ్

3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “లెహరాయి” సాంగ్

Published on Sep 17, 2021 8:24 PM IST


బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు మరియు పాటలు సినిమా పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా విడుదల అయిన లెహరాయి పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

లెహరాయి పాటకు యూ ట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటకి శ్రీమణి లిరిక్స్ రాయగా, సిద్ శ్రీరామ్ పాడారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణ లో జీ ఏ 2 పతాకం పై బన్నీ వాసు, వాసు వర్మ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు