3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “రిపబ్లిక్” ట్రైలర్

Published on Sep 22, 2021 8:34 pm IST


సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేయడం జరిగింది. అయితే విడుదల చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాక ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. రిపబ్లిక్ ట్రైలర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో నంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది.

పొలిటికల్ టచ్ తో ఉన్న ఈ రిపబ్లిక్ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కో జగపతి బాబు, రమ్యకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :