మరో మూడు అవార్డులను సొంతం చేసుకున్న “ఆర్ఆర్ఆర్”

మరో మూడు అవార్డులను సొంతం చేసుకున్న “ఆర్ఆర్ఆర్”

Published on Dec 19, 2022 3:30 PM IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల నుండి అనేక ముఖ్యమైన అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం, ఇప్పుడు మరో 3 అవార్డులను కైవసం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (PFCC) ద్వారా ఎపిక్ పీరియడ్ డ్రామాకు 3 అవార్డులు లభించాయి.

ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు ఉత్తమ స్కోర్/సౌండ్‌ట్రాక్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం అవార్డులను గెలుపొందడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు PFCCకి ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల, RRR గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. డివివి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ బిగ్గీలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి ఈ భారీ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు