ఇంట్రెస్టింగ్ గా, ఆలోచింపజేసేలా “3 రోజెస్” ట్రైలర్.!

Published on Nov 11, 2021 12:39 pm IST

మన తెలుగులో స్టార్ట్ అయ్యినటువంటి మొట్ట మొదటి తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో తెలుగు వెబ్ ఆడియెన్స్ కి ఎంత మంచి కంటెంట్ దొరుకుంతుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ తో ఆహా వారు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆసక్తికర షోస్ తో ఆహాలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ వస్తున్న వీరి నుంచి వస్తున్న సరికొత్త షో “3 రోజెస్” అనే కొత్త షో కూడా రెడీ అవుతుంది.

గత కొన్ని రోజులు నుంచి మంచి బజ్ తో ఉన్న ఈ షో తాలూకా ట్రైలర్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా అలాగే పూర్ణ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ట్రైలర్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఒకింత ఆలోచింపజేసేదిలా అనిపిస్తుంది. ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చాక అమ్మాయిలకు పెళ్లి చెయ్యడం అనే కాన్సెప్ట్ ని ఓ పక్క ఎంటర్టైన్మెంట్ వెర్షన్ తో పాటుగా వారిని ఇన్నాళ్లు పెంచి చదివించి పెళ్లి పేరిట ఇంకొకరి నీడలోకి పంపించడం అనే కాన్సెప్ట్ తో మాగీ డైరెక్షన్ బాగుంది.

అలాగే ఇందులో ఎస్ కె ఎన్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్స్ కూడా తమ రోల్స్ లో బాగా ఫిట్ అయ్యారు. ఇంకా సన్నీ ఎం ఆర్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్ గా అయితే ఈ “3 రోజెస్” ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. అలాగే రేపు నవంబర్ 12 నుంచే ఆహా లో ఈ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :