30 రోజుల్లో “వాల్తేరు వీరయ్య” ప్రీమియర్స్.!

30 రోజుల్లో “వాల్తేరు వీరయ్య” ప్రీమియర్స్.!

Published on Dec 13, 2022 4:08 PM IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మరో మాస్ కథానాయకుడు మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” మాస్ ఆడియెన్స్ లో మరిన్ని అంచనాలు నెలకొల్పుకుంటూ వస్తున్న ఈ చిత్రం అయితే ఆల్రెడీ ఆన్లైన్ హంగామా ని స్టార్ట్ చేసుకుంది. ఈ చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తుండగా మరి వీరి రిలీజ్ కి ఈరోజుతో సరిగ్గా 30 రోజులు మాత్రమే గడువు ఉంది.

దీనితో వాల్తేరు వీరయ్య మాసివ్ ప్రీమియర్స్ పై నెల రోజులు ముందు నుంచే మంచి హంగామా అయితే స్టార్ట్ చేశారు. ఇక ఈ చిత్రంపై అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా జనవరి 12న యూఎస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు