RRR మాస్ ఆంతెం సాంగ్ కి విశేష స్పందన

RRR మాస్ ఆంతెం సాంగ్ కి విశేష స్పందన

Published on Apr 14, 2022 3:02 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తోంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన RRR మాస్ ఆంతెం కి విశేష స్పందన లభిస్తోంది. మొత్తం అన్ని భాషల్లో ఈ పాటకి 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరు కలిసి అద్దిరిపోయే స్టెప్పులు వేసిన పాట ఇది. అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు