మరింత ఆకట్టుకునేలా “30 వెడ్స్ 21” సీజన్-2 టీజర్..!

Published on Feb 1, 2022 1:00 am IST

యూట్యూబ్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో చాయ్ బిస్కెట్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ “30 వెడ్స్ 21” ఎంతటి ప్రేక్షాకదరణను పొందిందో పెద్దగా చెపాల్సిన పనిలేదు. గత ఏడాది 6 ఎపిసోడ్‌లతో వచ్చిన సీజన్-1 కొత్త అనుభూతిని పంచింది. అయితే ఈ సిరీస్ సీజన్-2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి చాయ్ బిస్కెట్ గుడ్‌న్యూస్ చెప్పింది.

ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదిన సీజన్-2ని విడుదల చేస్తున్నట్టు తెలిపింది. రిలీజ్ తేదిని తెలుపుతూ టీజర్‌ని కూడా రిలీజ్ చేసింది. ఇందులో పృథ్వీ(చైతన్యరావ్), మేఘన(అనన్య)ల జంట మధ్య సాగిన రొమాంటిక్ సన్నివేశాలు, హృదయాన్ని హత్తుకునే డైలాగ్స్, విజువల్స్ ఇలా అన్ని టీజర్‌లో రిచ్‌గా ఉన్నాయి. మనోజ్ పి అందించిన ఈ కథకు పృథ్వీ వనం దర్శకత్వం వహించాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :