30 వసంతాలు పూర్తి చేసుకున్న ఇండియన్ క్లాసిక్ “ఆదిత్య 369”

Published on Jul 18, 2021 1:54 pm IST

అసలు సినిమా అనేదే ఒక కొత్త ప్రపంచం.. తమకున్న అన్ని టెన్షన్స్ మర్చిపోయి మూడు గంటల పాటు సరికొత్త అనుభూతిని ఎంజాయ్ చెయ్యాలనే ప్రేక్షకులు సినిమాలను అంతలా చూస్తారు. మరి అలాంటి సినిమాల్లో ఎన్నెన్నో కొత్త కోణాలు వాటిలో చరిత్ర సృష్టించేవి, ఎన్నాళ్ళు అయినా కూడా చరిత్రలో నిలిచిపోయేవి ఉంటాయి. మరి అలాంటి సినిమాల్లో ఇండియన్ సినిమా దగ్గర చీర స్థాయిగా నిలిచిపోయేది నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు వెర్సిటైల్ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ నిర్మాణంలో వచ్చిన అద్భుత చిత్రం “ఆదిత్య 369” కూడా ఒకటి.

ఒక్క ఇండియన్ సినిమా దగ్గర మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా అనే కాకుండా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. చాలా సున్నితమైన ఈ సబ్జెక్టు కి పౌరాణిక షేడ్ ని జత చేసి అందులో కూడా బాలయ్యతో శ్రీకృష్ణ దేవరాయ గా నటింపజేసి అత్యద్భుతంగా రక్తి కట్టించారు. టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ని 1991 లోనే టచ్ చేసి మ్యాజిక్ చేసిన వీరి కాంబో సరిగ్గా ఇదే రోజున జూలై 18న రిలీజ్ అయ్యి టాలీవుడ్ కే కాకుండా మొత్తం ఇండియన్ సినిమాకే సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించింది.

అలాగే భారీ వసూళ్లను కూడా రాబట్టి కనక వర్షం కూడా కురిపించింది. ముఖ్యంగా మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం కూడా ఈ చిత్రానికి అతి పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. మరి అలాంటి ఈ ఇండియన్ క్లాసిక్ చిత్రం నేటితో 30 వసంతాలు పూర్తి చేసుకోవడంతో అభిమానులు సహా సినీ వర్గాల వారు కూడా సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని గుర్తు చేసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అద్భుత చిత్రానికి సీక్వెల్ ని స్వయంగా బాలయ్యనే తన కొడుకు నందమూరి మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహించనున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :