“మ మ మహేషా” కి యూ ట్యూబ్ లో అద్దిరిపోయే రెస్పాన్స్!

Published on May 15, 2022 11:02 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విడుదల అయిన అన్ని చోట్ల ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా, మంచి వసూళ్లను రాబడుతోంది.

ఈ చిత్రం లోని మ మ మహేషా సాంగ్ లిరికల్ వీడియో కి యూ ట్యూబ్ లో అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 31 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ పాటకు థియేటర్ల లో సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది. నదియా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాల పై నిర్మించడం జరిగింది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :