మాస్ మహారాజ రవితేజ హీరోగా కావ్య థపర్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ డ్రామా “ఈగల్” కోసం ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు రవితేజ బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేయగా ఈ సాంగ్ మాత్రం మంచి సూపర్ స్టైలిష్ గా ఉందని చెప్పాలి.
మరి ఈ సాంగ్ కి జార్జినా మాథ్యు ఇచ్చిన లిరిక్స్ అలాగే తన వోకల్స్ లో డేవ్ జాన్ డి ఇచ్చిన సంగీతంతో ఈ సాంగ్ ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన అనిరుద్ కంపోజిషన్ లియో తరహాలో సాలిడ్ కట్ తో ఇంగ్లీష్ వెర్షన్ లో సాంగ్ బాగుంది. అలాగే రవితేజ పాత్రని ప్రెజెంట్ చేస్తూ తననో పవర్ ఫుల్ స్నైపర్ గా ఇందులో చూపించిన విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
మొత్తానికి అయితే రవితేజ ఫ్యాన్స్ కి మేకర్స్ మంచి బర్త్ డే ట్రీట్ ని అందించారు అని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించగా ఈ ఫిబ్రవరి 9న తెలుగు సహా హిందీలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి