యూ ట్యూబ్ లో టాప్ లో దూసుకు పోతున్న డానియల్ శేఖర్!

యూ ట్యూబ్ లో టాప్ లో దూసుకు పోతున్న డానియల్ శేఖర్!

Published on Sep 21, 2021 4:26 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, మరొక పవర్ ఫుల్ పాత్ర లో రానా దగ్గుపాటి నటిస్తున్నారు. ఈ చిత్రం లో రానా డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ పాత్ర కి సంబంధించిన పరిచయ విడియో ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అంతేకాక యూ ట్యూబ్ లో 4.5 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకొని టాప్ లో దూసుకు పోతుంది. ఈ చిత్రం లో నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు