4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న అఖిల్ “లెహరాయి” సాంగ్

Published on Sep 20, 2021 3:40 pm IST

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అల్లు అరవింద్ సమర్పణ లో జీఎ 2 పతాకం పై బన్నీ వాసు, వాసు వర్మ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుండి లెహరాయి అంటూ ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ పాటను శ్రీమణి రాయగా, సిద్ శ్రీరామ్ పాడారు. ఈ మేరకు ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. ఈ సినిమా ను థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 8 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :