4 మిలియన్స్ వ్యూస్ తో నాని “దసరా” థర్డ్ సింగిల్

4 మిలియన్స్ వ్యూస్ తో నాని “దసరా” థర్డ్ సింగిల్

Published on Mar 9, 2023 12:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నుండి నిన్న విడుదలైన మూడో పాట చంకీలా అంగీలేసి పాట కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ పాట యూ ట్యూబ్ లో 4 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు