“శ్యామ్ సింగ రాయ్” నుండి విడుదలైన ప్రణవాలయ పాట కి భారీ రెస్పాన్స్..!

Published on Dec 20, 2021 1:31 pm IST

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రణవాలయ లిరికల్ వీడియో కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ పాట 4 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించడం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఆఖరి పాట కావడం, సాయి పల్లవి అద్భుత డాన్స్ ఉండటం తో పాట కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ గా చిత్రం ఉండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :