రొమాంటిక్ ట్రైలర్ కీ సాలిడ్ రెస్పాన్స్…యూ ట్యూబ్ లో ట్రెండ్!

Published on Oct 21, 2021 5:12 pm IST

ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్ లుగా అనీల్ పాడూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం ను ఈ నెల 29 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడం జరిగింది. మొదటి నుండి ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే రొమాంటిక్ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ కి 4 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ మరియు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై ఛార్మి కౌర్ మరియు పూరి జగన్నాథ్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :