సంక్రాంతి 2023 : బాక్సాఫీస్ వద్ద చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు ?

సంక్రాంతి 2023 : బాక్సాఫీస్ వద్ద చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు ?

Published on Dec 1, 2022 3:01 AM IST

రాబోయే 2023 సంక్రాంతికి మొత్తంగా నాలుగు బడా సినిమాలు థియేటర్స్ లో ఆడియన్స్, ఫ్యాన్స్ ముందుకి రాబోతున్నాయి. వాటిలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి ఒకటి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన జై బాలయ్య సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతి రేస్ లో ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ వాల్తేర్ వీరయ్య పై ఆడియన్స్, ఫ్యాన్స్ లో సూపర్ గా అంచనాలు ఏర్పరిచాయి. అలానే ఇలయతలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ రొమాంటిక్ యాక్షన్ మూవీ వరిసు కూడా సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే.

తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇటీవల వరిసు నుండి రిలీజ్ అయిన రంజితమే సాంగ్ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుని మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

ఇక వీటితో పాటు తలా అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ వారితో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్న తునీవు మూవీ కూడా సంక్రాంతి 2023 రేస్ లో ఉంది. థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మంజు వారియర్ కీలక పాత్ర చేస్తుండగా జీబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తంగా ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడంతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్ వర్షం కురవనుంది. మరి వీటిలో ఏ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలని పలువురు ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుండగా, వాటిలో పక్కాగా విజయం ఎవరిదో తెలియాలి అంటే మరొక నెల రోజులు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు