“రౌడీ బాయ్స్” ట్రైలర్ కి 4 మిలియన్స్ కి పైగా వ్యూస్..!

“రౌడీ బాయ్స్” ట్రైలర్ కి 4 మిలియన్స్ కి పైగా వ్యూస్..!

Published on Jan 9, 2022 9:55 PM IST


ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ హర్ష కోనుగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్ కి యూ ట్యూబ్ లో 4.4 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. జనవరి 14 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు