‘కేరళ స్టోరీ’ లో ఆ సీన్స్ కోసం 16 డిగ్రీల క్లైమేట్ లో 40 గంటలు కష్టపడ్డా – ఆదాశర్మ

Published on Jun 2, 2023 3:00 am IST

ప్రస్తుతం ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ తో కలెక్షన్ తో కొనసాగుతున్న వివాదాస్పద సినిమా కేరళ స్టోరీ. డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించగా యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ కీలకపాత్రలలో నటించారు. కేరళలలో అమాయకులైన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ క్యాంపులకి పంపించి దేశ వ్యతిరేకులుగా మార్చారనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.

ఇప్పటికే ఈ సినిమా మొత్తంగా రూ. 230 కోట్ల కు పైగా కలెక్షన్ తో దూసుకెళుతోంది. విషయం ఏమిటంటే, ఈ సినిమాలోని పలు కీలక సీన్స్ కోసం తామందరం ఎంతో కష్టపడ్డాం అని ఆదా శర్మ తాజగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. మైనస్ 16 డిగ్రీల చలి వాతావరణంలో దాదాపుగా 40 గంటల పాటు కష్టపడ్డాం అని, దానితో డీ హైడ్రేషన్ కారణంగా తన పెదవులు చాలా వరకు పగిలాయని అన్నారు. రాళ్ల లో కింద పడే సన్నివేశాలు సహజంగా చేయడంతో మోకాళ్ళు, చేతులకు దెబ్బలకు తగిలాయని కేరళ స్టోరీ షూట్ సమయంలోని కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ తెలిపారు ఆదా శర్మ. ఆ విధంగా తామందరం పడ్డ కష్టానికి ప్రతిఫలంగా సినిమా ఇంత గొప్ప ఆదరణ అందుకుంటూ ఉండడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

సంబంధిత సమాచారం :