40 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోన్న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్!

40 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోన్న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్!

Published on Sep 28, 2021 10:10 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం నుండి విడుదలైన మేకింగ్ వీడియో, ఫస్ట్ గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ యూ ట్యూబ్ లో ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ ఫస్ట్ సింగిల్ కి 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాక 1.2 మిలియన్ లైక్స్ రావడం విశేషం.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో నిత్యా మీనన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. సంగీతం దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు