40 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “నాటు నాటు”

40 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “నాటు నాటు”

Published on Nov 16, 2021 9:56 PM IST


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన నాటు నాటు లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇప్పటి వరకూ ఈ లిరికల్ వీడియో కి అన్ని బాషల్లో కలిపి 40 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు