రామ్ పొతినేని “హాలో గురు ప్రేమకోసమే” సెన్సేషన్!

Published on Feb 13, 2022 10:13 pm IST

రామ్ పోతీనేని హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హాలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రం రామ్ కెరీర్ లో కీలకం అని చెప్పాలి. థియేటర్ల లో యూత్ ను విశేషం గా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరొక సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది.

ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ హిందీ వెర్షన్ కి గానూ 400 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. రామ్ కెరీర్ లో నేను శైలజా చిత్రం హిందీ వెర్షన్ తర్వాత ఇది రెండవది. ఈ న్యూస్ పట్ల రామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :