భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న సమంత ఐటమ్ సాంగ్

భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న సమంత ఐటమ్ సాంగ్

Published on Dec 15, 2021 10:30 AM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ ఈ చిత్రం లో రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నుండి విడుదలైన ఊ అంటావా… ఊ ఊ అంటావా అనే ఐటెం సాంగ్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట లో సమంత నటించగా, సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. యూ ట్యూబ్ లో ఇప్పటి వరకు అన్ని బాషల్లో 45 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, 1.6 మిలియన్స్ కి పైగా లైక్స్ రావడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తం శెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు