భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ దూకుడు తగ్గేలా లేదుగా!

Published on Oct 7, 2021 12:01 pm IST

పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, మేకింగ్ వీడియో, పవన్ కళ్యాణ్ రానా ల పరిచయ వీడియో లు సినిమా పై మరింత ఆసక్తి ను పెంచేశాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ యూ ట్యూబ్ లో ఇంకా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. ఇప్పటి వరకూ ఈ పాట 45 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించడం జరిగింది. అంతేకాక 1.2 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ దూకుడు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అంతేకాక ఈ చిత్రం నుండి అంత ఇష్టం అంటూ ఒక మెలోడియస్ పాట ఈ అక్టోబర్ 15 వ తేదీన విడుదల కానుంది. నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు ఈ చిత్రం లో లేడి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :