భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న “స్కంద” ట్రైలర్!

Published on Sep 3, 2023 7:30 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. సెప్టెంబర్ 15, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి అంచనాలను మరింతగా పెంచేసింది అని చెప్పాలి. ట్రైలర్ భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 45 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది ట్రైలర్. శ్రీ లీల, సాయి మంజ్రేకర్ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :