కొత్త సౌండ్ టెక్నాలిజీ తో అలరించనున్న ‘2.0’ !క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘2.0’ చిత్రం విడుదలకు సమయం దగ్గర పడింది. ఈచిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈచిత్రంలో 4డి అనే సరికొత్త సౌండ్ టెక్నాలజీ ని ఉపయోగించారు. దేశ సినీ చరిత్రలో ఇలాంటి టెక్నాలజీ వాడడం ఇదే మొదటిసారి. సూపర్ స్టార్ రజినీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రోబో కి సీక్వెల్ గా రానుంది.

ఈ నవంబర్ 29న తెలుగు, తమిళ , హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానున్న ఈచిత్రం ఫై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫిస్ రికార్డులను తిరుగరాయడం ఖాయంగా కనిపిస్తుంది.

Here is the sound of the future!

Presenting to you the 4D Audio Technology in #2Point0.@2Point0movie #2Point0FromNov29 @rajinikanth @akshaykumar @shankarshanmugh @arrahman @iamAmyJackson #NiravShah @editoranthony @madhankarky @resulp pic.twitter.com/8tKcI1yguY

— Lyca Productions (@LycaProductions) November 19, 2018

Advertising
Advertising