టాప్ లో దూసుకు పోతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోమో!

Published on Nov 1, 2021 4:00 pm IST

మొట్ట మొదటి సారిగా ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాప్ ఆఫ్ ఆల్ షోస్ అయిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరిట ఒక కార్యక్రమం మొదలు కానుంది. ఈ షో కి సంబందించిన మొదటి ఎపిసొడ్ ప్రోమో ను తాజా ఆహా వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. యూ ట్యూబ్ లో కూడా ఆహా లో పోస్ట్ చేయడం తో అభిమానులు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రోమో కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఈ మొదటి ఎపిసొడ్ ప్రోమో ఇప్పటి వరకూ 5 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. రికార్డ్స్ సృష్టించాలి అన్న ఆయనే, తిరగ రాయాలి అన్న ఆయనే అంటూ ఆహా వీడియో తెలిపింది. ఈ కార్యక్రమం నవంబర్ 4 వ తేదీ నుండి ఆహా వీడియో లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :