గని టీజర్ కి సూపర్ రెస్పాన్స్..!

Published on Nov 16, 2021 11:25 am IST

వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సమర్పణ లో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ లో డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాయి. ఈ చిత్రం టీజర్ 24 గంటల్లో 5.1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా, 210 కే కి పైగా లైక్స్ ను సాధించడం జరిగింది. డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం లో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More