5 ప్లస్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “విక్రాంత్ రోణ” ఫస్ట్ గ్లింప్స్

5 ప్లస్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “విక్రాంత్ రోణ” ఫస్ట్ గ్లింప్స్

Published on Sep 4, 2021 12:34 AM IST


సుదీప్ కిచ్చా హీరోగా అనూప్ భండారి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విక్రాంత్ రొణ. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా ఐదు బాషల్లో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయింది. సుదీప్ కిచ్ఛా పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన ఈ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

డెడ్ మాన్ ఆంతెం గా విడుదల అయిన ఈ గ్లింప్స్ లో సుదీప్ మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తున్నారు. పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. డైలాగ్స్ తో నుండి ఉన్న ఈ గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది అని చెప్పాలి. ఈ చిత్రం నుండి విడుదల అయిన వీడియో కి ఇప్పటి వరకూ కూడా 5 ప్లస్ మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక ఈ వీడియో యూ ట్యూబ్ లో టాప్ 4 లో నిలిచింది. ఈ చిత్రం లో నిరూప్ భండారి, నీత అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బీ. అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు