5 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “గుడ్ లక్ సఖి” ట్రైలర్

Published on Jan 25, 2022 10:45 am IST


కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రల్లో నగేష్ కుకునూరు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి. సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను జనవరి 28 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో సైతం 5 మిలియన్స్ వ్యూస్ తో దూసుకు పోతుంది. ప్రస్తుతం టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :