5 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోన్న “లెహరాయి” సాంగ్

5 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోన్న “లెహరాయి” సాంగ్

Published on Sep 27, 2021 8:29 PM IST


అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం ను గీతా ఆర్ట్స్ 2 పతాకం పై బన్నీ వాసు, వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన లెహారాయి పాట కి యూత్ నుండి విశేష ఆదరణ వస్తోంది. ఇప్పటి వరకూ 5 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకొని టాప్ 2 లో ట్రెండ్ అవుతోంది.

గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ లెహారాయి పాట ఇప్పుడు సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది. ఈ చిత్రం ను అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు