సిద్ధ టీజర్ కి భారీ వ్యూస్… సిసలైన పవర్ చూపిస్తున్న ఆచార్య!

Published on Nov 29, 2021 12:03 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ పాత్ర లో నటిస్తున్నారు. ఈ పాత్ర కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ పాత్ర కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సిద్దస్ సాగా పేరిట విడుదల చేయడం జరిగింది.

ఈ టీజర్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ ను కొల్లగోడుతుంది. ఇప్పటి వరకూ ఈ టీజర్ కి యూ ట్యూబ్ లో 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. అంతేకాక 335 కే కి పైగా లైక్స్ వచ్చాయి. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :