టాప్ లో ట్రెండ్ అవుతోన్న “టక్ జగదీష్” ట్రైలర్!

Published on Sep 2, 2021 1:00 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, డానియల్, తిరువీర్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిన్న సాయంత్రం ఈ ట్రైలర్ విడుదల కాగా, ప్రస్తుతం 5 ప్లస్ మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. అంతేకాక 168కే ప్లస్ లైక్స్ తో దూసుకు పోతుంది. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :