“పుష్ప”లో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ఐదుగురు స్టార్స్..!

Published on Jan 28, 2022 1:13 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప ది రైజ్”. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “పుష్ప” హవానే నడుస్తుంది.

అయితే ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నారట. సుకుమార్ పుష్ప స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్ కంటే ముందు మహేష్ బాబుకు వివరించాడట.. కానీ మహేష్ మేకోవర్ చేయించుకోవడానికి, స్క్రీన్‌పై నెగెటివ్ క్యారెక్టర్‌ని చూపించడానికి ఇష్టపడలేదట. ఇక శ్రీవల్లి పాత్రను మొదట సమంతకు ఆఫర్ చేశారని, కొన్ని కారణాలతో ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. చివరికి ఆ పాత్ర రష్మికకి వెళ్లింది.

ఇదిలా ఉండగా ‘ఊ అంటావా’ పాటకు దిశా ఫస్ట్ ఛాయిస్ అనుకోగా పలు కారణాలతో ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ నోరాను ఈ పాట కోసం సంప్రదించగా ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందట. దీంతో వెనక్కి తగ్గిన చిత్ర బృందం చివరకు తీవ్ర ప్రయత్నాలు చేసి సమంతను ఈ పాటకు ఒప్పించారట. ఇక ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను విజయ్ సేతుపతికి మొదట ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే డేట్స్ సమస్యల కారణంగా విజయ్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడట.

సంబంధిత సమాచారం :