రాధేశ్యామ్ క్లైమాక్స్ కోసం 50 కోట్లు ఖర్చు చేశారా?

Published on Oct 20, 2021 3:03 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” సినిమా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఇప్పటికే తెలిసిన విషయమే.

అయితే మేకర్స్ కేవలం క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఖర్చు చేశారని తాజా సమాచారం. అంతేకాదు ఈ క్లైమాక్స్ దాదాపు 15 నిమిషాల పాటు ప్రదర్శించబడుతుందని మరియు ప్రేక్షకుల మనసులను కదిలించబోతోందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్ధే నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More