50 రోజుల్లో థియేటర్ల లోకి పొన్నియిన్ సెల్వన్2

Published on Mar 9, 2023 3:48 pm IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయరామ్, త్రిష, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పాన్నియిన్ సెల్వన్. ఈ చిత్రం రెండో పార్ట్ ఏప్రిల్ 28 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. రిలీజ్ కి ఇంకా 50 రోజుల మాత్రమే ఉండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది.

ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ లపై సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడం తో రెండో పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :