50 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న శ్రీవల్లి సాంగ్!

Published on Nov 10, 2021 12:19 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి విడుదలైన శ్రీవల్లి లిరికల్ వీడియో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ పాట యూ ట్యూబ్ లో మరొక మైలు రాయి ను అధిగమించింది. ఈ పాట ఇప్పటి వరకూ 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తుండగా, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More