బాలీవుడ్ లో 83 ట్రైలర్ రికార్డ్..!

Published on Dec 1, 2021 7:48 pm IST


రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 83. జూన్ 25, 1983 లో లార్డ్స్ మైదానం లో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. అప్పుడు క్రియేట్ చేసిన రికార్డ్ చరిత్రలో నిలిచింది. కపిల్ దేవ్ సారథ్యం లో గెలిచిన వరల్డ్ కప్ భారతీయులను గర్వ పడేలా చేసింది. ఇప్పుడు రన్ వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్ర లో నటిస్తున్నారు. 83 కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ బాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఒక్క రోజులోనే 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పలు బాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం లో దీపికా పదుకునే, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్ భాసిన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :