500కే లైక్స్ తో దూసుకు పోతున్న లాలా భీమ్లా!

Published on Nov 7, 2021 5:35 pm IST

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి మాస్ బీట్ లాలా భీమ్లా లిరికల్ వీడియో విడుదల అయ్యింది.

ఈ పాటకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిక్స్ రాయగా, అరుణ్ కౌండిన్య పాడారు. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే విధంగా యూ ట్యూబ్ లో సైతం ట్రెండ్ బాట పట్టింది. ఈ పాట ఇప్పుడు 2.8 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది. అదే విధంగా 515కే లైక్స్ ను సాధించడం జరిగింది. ఈ ట్రెండ్ మరింత వేగం గా కొనసాగితే 1 మిలియన్ లైక్స్ ను 24 గంటల్లో సాధించే అవకాశం ఉంది. ఈ పాట మాస్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :