ఎన్టీఆర్, మహేష్ లకు 6 రోజుల గ్యాప్ సరిపోతుందా !


ఈ నెలాఖరు రెండు భారీ సినిమాల పోటీతో రసవత్తరంగా మారనుంది. ముందుగా ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాతో 21న వస్తుండగా కేవలం 6 రోజుల వ్యవధిలో మహేష్ తన ‘స్పైడర్’ తో దిగుతున్నాడు. ఇలా ఇద్దరు బడా హీరోల సినిమాలు వెంట వెంటనే విడుదలవుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లలో కొంత ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఒక్కో ఏరియాలో ఈ సినిమాలు అమ్ముడుపోయిన ధరలు అటువంటివి మరి.

‘జై లవ కుశ’ మొత్తంగా రూ. 115 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా అందులో తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.85 కోట్ల పైమాటే. అలాగే ‘స్పైడర్’ జరిపిన 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపు 60 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ఇలా ఈ రెండు సినిమాలు చేసిన భారీ బిజినెస్ రికవర్ కావాలంటే రెండూ కూడా సూపర్ హిట్లు కావాలి. లేదా రెండింటి విడుదల తేదీల మధ్య కనీసం రెండు వారాలకు పైగానే గ్యాప్ ఉండి, ప్రతి సినిమా వీలైనన్ని థియేటర్లలో ఎక్కువ రోజులు నడిచేలా ప్లాన్ చేసుకోవాలి.

కానీ ఈ సినిమాలు చూస్తే గట్టిగా వారం వ్యవధి కూడా లేకుండా వెంట వెంటనే వస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కదాని ఫలితం తారుమారైనా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు గల్లంతైపోవడం ఖాయం. ఈ గండం గట్టెక్కాలంటే ఉన్న అవకాశాల్లో ఒకటైన రిలీజ్ డేట్ల మధ్య దూరం అనే అవకాశం ఎలాగూ దూరమైపోయింది కాబట్టి మిగిలిన రెండవ ఛాన్స్ సిమాలు రెండూ పెద్ద హిట్లై, లాంగ్ రన్ పొందడం. అనేది సఫలమై రెండు చిత్రాలు మంచి విజయాలుగా నిలవాలని, డిస్ట్రిబ్యూటర్లందరూ సేఫ్ అవ్వాలని కోరుకుందాం.